KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు.
అధికారంలోకి రాగానే తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలని రాహుల్ నరికిండు. ఇవాళ నిరుద్యోగుల గురించి ప్రస్తావన లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి రాష్ట్రంలోని నిరుద్యోగులు నవ్వుతున్నారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే.. కాగితాలు ఇచ్చిన సన్నాసులు మీరు. 2 లక్షల ఉద్యోగాల గురించి డిమాండ్ చేస్తున్నా.. దరమ్ముంటే రా రాహుల్ గాంధీ.. అశోక్ నగర్‌కు రా.. చర్చ పెట్టి ఉద్యోగాల భర్తీ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. నిరుద్యోగ భృతి, యువ వికాసం అన్నారు. వీటి గురించి ఒక్క మాట లేదు. విద్యాభరోసా కార్డు గురించి ప్రస్తావన లేదు. ఉన్న గురుకులాలను నిర్వహించలేని అసమర్థలు వీరు.. 80 మందికి పైచిలుకు పిల్లలు చనిపోతే నివారించలేని వారు.. కొత్త స్కూల్స్ కడుతామని బిల్డప్స్ ఇస్తున్నారు.. సిగ్గు పడాలని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.