హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ముంచే రోజులు పోయి మళ్లీ మంచిరోజులు వస్తాయని, అన్నదాతలు ఆత్మైస్థెర్యం కోల్పోవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి రేవంత్ సర్కారే కారణమని ఆరోపించారు. పొలం ఉన్న రైతులనూ పొట్టనబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కౌలు తీసుకున్న కర్షకుల నూ కబళిస్తున్నారని ఎక్స్‌వేదికగా ఆగ్ర హం వ్యక్తంచేశారు. సాగునీటి సంక్షో భం, రుణమాఫీ ద్రోహం, రైతుభరోసా మోసం, కౌలు రైతుకు అందని సాయం.. రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలను ఒకొకటిగా ఎగ్గొట్టడంతోనే వ్యవసాయం విషవలయంలో చిక్కుకున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో వందలాదిమంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా చలనం లేదని, ముఖ్యమంత్రికి సోయిలేదని, ప్రభుత్వానికి బాధ్య త లేదని దుయ్యబట్టారు. దసరా పండు గ వేళ వ్యవసాయాన్ని దండుగలా మా ర్చిన సీఎం రేవంత్‌కు రైతన్నల చేతిలో దండన తప్పదని హెచ్చరించారు.