హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): అబద్ధపు హామీలు, గారడీ గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తెలంగాణ రైతులకు చెప్పుతో కొట్టుకునే దుస్థితి దాపురించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆవేదన వ్యక్తంచేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతు లక్ష్మణ్‌యాదవ్ తన గోసను వెళ్లగకితే అక్రమ కేసుల పేరిట వేధిస్తారా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగ హకు అనే విషయం అదే రాజ్యాంగంపై సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డికి తెలియదా? అని నిలదీశారు. దేశానికే అన్నం పెట్టే రైతుపై అక్రమంగా కేసు బనాయించడం దుర్మార్గమైన చర్యే కాదు.. సీఎం దిగజారుడుతనానికి నిదర్శనమని శుక్రవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
అర్ధరాత్రి రైతు ఇంటికి పోలీసులా?
యూరియా దొరకక కళ్లముందే పంట ఎండిపోవడంతో ఆక్రోశంలో మాట్లాడిన రైతుపై కక్షగట్టి అర్ధరాత్రి పోలీసులను రైతు ఇంటిపైకి పంపించి రైతు లక్ష్మణ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఇందిరమ్మ రాజ్యంలో బస్తా యూరియాకు దికులేక అల్లాడుతున్న అన్నదాతలకు నిరసన తెలిపే హకు లేదా? అని ప్రశించారు. రాజ్యాంగాన్ని పట్టుకుని పోజులు కొట్టే రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలె. పదేండ్లలో లేని యూరి యా సంక్షోభాన్ని తన చేతకానితనంతో సృష్టించిన రేవంత్‌పై కోపాగ్నితో రగిలిపోతున్న లక్షలాదిమంది రైతులపై కేసులు పెట్టే దమ్ము ఈ సరారుకు ఉన్నదా? అని ప్రశ్నించారు.