హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ములుగులో ఓ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయినా ఓదార్పుకోసం ఎదురుచూస్తు న్న బాధితులను పట్టించుకోకుండా, వాహనాలు ఆపకుండా మంత్రులు వెళ్లిపోవడం విడ్డూరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘కేసీఆర్ హయాంలో రూపుదిద్దుకు న్న ఆరోగ్య తెలంగాణ.. కాంగ్రెస్ పాలనలో ఆగమవుతున్నది. ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్న నిర్లక్ష్య ఘటనలే సాక్ష్యం. అమరచింత ఘటన మరువకముందే ములుగు లో మరోఘటన చోటుచేసుకోవడం బాధాకరం’ అని ఆవేదన వ్యక్తంచేశారు. గురుకులాల్లో 50 మంది విద్యార్థులు మరణించినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. సర్కారు భూదాహానికి నోరులేని మూగజీవు లు ప్రాణాలు కోల్పోతే ఏఐ దృశ్యాలంటూ ఎగతాళి చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు… పసిబిడ్డ ప్రాణాలు కోల్పోతే కన్నెత్తి చూస్తారనుకోవడం అత్యాశే అవుతుందని విమర్శించారు. అమానవీయ ఘటనలకు కాంగ్రెస్ నాయకుల గుండెలు కరగవని, వారు బాధితులవైపు కన్నెత్తిచూడరని మండిపడ్డారు.