KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సీఎం రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గుడిబండ పెద్ద వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ కొట్టుకుపోయిన ఘటనపై కేటీఆర్ స్పందించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వడం చేతకాదు.. సుంకిశాల రిటైనింగ్ వాల్ సరిగ్గా కట్టించే తెలివిలేదు.. చివరికి ఓ చెక్ డ్యామ్‌ను కూడా నిర్మించలేని కాంగ్రెస్ సన్నాసులు కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లడం సిగ్గుచేటు అని కేటీఆర్ మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్ద వాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్ డ్యామ్ రెండు నెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
నాసిరకం పనులు చేసి రైతుల పొలాలు, మోటర్ పైప్ లైన్లు, చివరికి ట్రాన్స్ఫార్మర్ కూడా కొట్టుకుపోయే దుస్థితికి కారణమైన ప్రతి ఒక్కరిపై సర్కారు చర్య తీసుకుని బాధితులను ఆదుకోవాలి. ప్రాజెక్టుల మాట దేవుడెరుగు చివరికి ఒక్క ఇటుక కూడా సరిగా పేర్చలేని ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సర్కారు ముక్కు నేలకు రాసి మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకోమని లెంపలేసుకోవాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
SLBC టన్నెల్ తొవ్వడం చేతకాదు..
సుంకిశాల రిటైనింగ్ వాల్ సరిగ్గా కట్టించే తెలివిలేదు..
చివరికి ఓ చెక్ డ్యామ్ ను కూడా నిర్మించలేని కాంగ్రెస్ సన్నాసులు కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లడం సిగ్గుచేటు..
మహబూబ్ నగర్ లోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్ద వాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్… pic.twitter.com/jD5fctDGM6
— KTR (@KTRBRS) August 19, 2025