KTR | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పూటకో అక్రమ కేసు పెట్టడం, రోజుకో బీఆర్ఎస్ నేతను అరెస్టు చేయడం రేవంత్ సరారుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని ఏకపక్షంగా అరె స్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు. రైతురుణమాఫీని ఎగ్గొట్టి, దళితబంధుకు పాతరేసిన కాం గ్రెస్ సరారును ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని సీఎం అణచివేత చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సీఎం రేవంత్‌రెడ్డిపై చర్య తీసుకోవాల్సిందిపోయి ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్‌రెడ్డిపై కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు. పోరాటాలే ఊపిరిగా పుట్టిన గులాబీ పార్టీ నేతల ఆత్మస్థయిర్యాన్ని చిల్లర చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ దెబ్బతీయలేదని స్పష్టంచేశారు. కౌశిను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రశాంత తెలంగాణలో అశాంతి చర్యలు : హరీశ్‌రావు
ప్రశాంత తెలంగాణలో అణచివేత, అశాంతిని సృష్టించటమే రే వంత్ సర్కార్ విధానంగా పెట్టుకున్నదని, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు అందులో భాగమేనని మా జీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టును ఆయ న తీవ్రంగా ఖండించారు. ‘మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే కేసులా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో పదేండ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, 13 నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులపై అక్రమంగా కేసులు బనాయించడం, నిలదీస్తే పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం నిత్యకృత్యం కావడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంలో కాం గ్రెస్ పాలన ఎమర్జెన్సీని తలిపిస్తున్నదని, కాంగ్రె స్ అణచివేతలు, నిర్బంధాలు, దా డులకు బీఆర్ఎస్ అదరదు బెదరదని, ప్రజాక్షేత్రంలో అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు.
ఒత్తిడికి తలొగ్గి అరెస్టు
ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఎమ్మెల్యేను అరె స్టు చేయటం సరికాదని డీజీపీ జితేందర్‌తో హరీశ్ పేర్కొన్నారు. అరెస్ట్ చేయదగిన కేసు కాకపోయినా, పండుగ వేళ ప్రజా ప్రతినిధిని అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని డీజీపీతో ఫోన్లో చెప్పారు. కక్షసాధింపు చర్యలకు పోలీసులు సహకరించవద్దని సూచించారు.