KTR | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో రైతుల దెబ్బకు దిగివచ్చిన సీఎం రేవంత్ లగచర్ల విషయంలోనూ లెంపలేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లగచర్లలో అల్లుడు, అదానీ కోసం ఇండస్ట్రియల్ కా రిడార్ ముసుగులో పెడుతున్న ఫార్మా, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలు వెనకి తీసుకోవాలని స్పష్టంచేశారు. అమాయక గిరిజనుల భూములను దొంగచాటుగా బలవంతంగా లాకునే కుట్రలకు ఇప్పటికైనా తెరదించి, ఆయా ప్రాంతాల్లో శాంతి ని నెలకొల్పాలని ఆయన ఎక్స్ వేదికగా సూచించారు. ఢిల్లీలో రైతుల పోరాటంతో ప్రధాని కూడా వెనకి తగ్గిన చరిత్రను చూశామని గుర్తుచేశారు. లగచర్లలో లడాయికి, దిలావర్పూర్లో ఇథనాల్ మంటలకు రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, మొండి వైఖరే కారణమని విమర్శించారు. సీఎం తీరుతో ఏ జిల్లాలో… ఏ పచ్చని పంట పొలాల్లో ఎలాంటి బాంబు పేలుతుందోననే రైతులందరిలోనూ నెలకొన్నదని పేర్కొన్నారు. లగచర్ల రైతుల సమరానికి రేవంత్‌రెడ్డి ఫుల్స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు.
ఎవరనుకున్నరు ఇట్లవుతదని!
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజాకవి కాళోజీ కవితలను ఉటంకిస్తూ కేటీఆర్ ఎక్స్‌వేదికగా ప్రభుత్వంపై వ్యం గ్యాస్త్రం సంధించారు. తెలంగాణాలో ఫించన్ల కోసం వృద్ధులు రోడ్డెకుతారని ఎవరనుకున్నరు? ఠంచన్‌గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరనుకున్న రు? మూసీ బ్యూటిఫికేషన్ కోసం లాక్షా యాభై వేల కోట్లు వెదజల్లి… కనికరం లే కుండా వృద్ధుల పెన్షన్ డబ్బులను ఆపుతారని ఎవరనుకున్నరు? మందుబిల్లల కోసం కొడుకులు, కోడళ్ల దగ్గర చేయిచాచే అవసరమేలేని రోజుల నుంచి మళ్లీ వేడుకునే మార్పు వస్తుందని ఎవరనుకున్నరు? అణువణువునా కరశత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఇకట్లే ఉంటాయని ఎవరనుకున్నరు? మార్పు ఇంత మోసగిస్తుందని ఎవరనుకున్నరు? అంటూ విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ కరకు గుండె కరిగేదెన్నడు…?
రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులకు కాంగ్రెస్ కరకు గుండె కరిగేదెన్నడు? రైతుల కష్టాలు తీరేదెన్నడు? అని కేటీఆర్ ప్రశ్నించారు. యాసంగి పోయి వానాకాలం, వానాకాలం పోయి యాసంగి వచ్చినా రైతుభరోసాపై సర్కార్‌కు స్పష్టత లేదని మండిపడ్డారు. గల్లా ఎగురేసిన రైతు నేల చూపులు చూస్తున్నాడని ఆవేదన వ్య క్తంచేశారు. రెండు విడతలుగా 20వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టి, రూ.31 వేల కోట్ల రుణమాఫీ అని ప్రకటించి, 17 వేల కోట్లతో సరిపెట్టి సర్కారు చేతులు దులుపుకుందని విమర్శించారు. రైతుభరోసా కోసం రైతులు, కౌలు రైతులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.