KTR | హైదరాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. వేముల ప్రశాంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి, దాడికి సంబంధించిన వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడుల్ని ఆపకుంటే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది అని కేటీఆర్ హెచ్చరించారు.
ప్రశాంత్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన గూండాలను వదిలేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నేతలను అరెస్టు చేయడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేముల ప్రశాంత్ ఇంటిపై దాడి చేసిన వారిపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.