నమస్తేతెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 30: బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు మిన్నంటా యి. ప్రభుత్వం విద్యుత్తు చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంపై హర్షం వ్య క్తమైంది. గులాబీ పార్టీ నేతల పోరాటంతోనే ప్రజలకు కరెంట్ చార్జీల పెంపు ముప్పు త ప్పిందని రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పటాకు లు కాల్చారు. ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ విజయమని నినదించారు. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పటాకులు కా ల్చారు. మిఠాయిలు పంచిపెట్టారు. హైదరాబాద్‌లోని గాంధీనగర్ డివిజన్ ఆంధ్రాకేఫ్ చౌరస్తాలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, పార్టీ నాయకుడు ముఠా జయసింహ శ్రేణులతో కలిసి టపాసులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు.
జగిత్యాలతోపాటు కోరుట్లలో మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాజన్న సిరిసిల్ల లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, మహబూబాబాద్‌లో ఎమ్మెల్సీ రవీందర్రావు.. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నెల్లికుదురులో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, వరంగల్‌లో మాజీ ఎమ్మెల్యే నరేందర్, భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సంబురా లు జరుపుకొన్నారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి.. టపాకులు కాల్చారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లాలో బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో సీట్లు పంపిణీ చేశా రు. ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్, మధిరలో కేసీఆర్ చిత్రపటానికి జడ్పీ మాజీ చైర్మన్ కమల్‌రాజు క్షీరాభిషేకం చేశారు. మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, మంచిర్యాల లో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చెన్నూర్‌లో బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చారు. నిర్మల్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోనూ సంబురాలు జరిగాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చారు.