హైదరాబాద్ : సినిమా టికెట్ ధరల ( Movie Ticket Prices) పెంపు ద్వారా వచ్చిన కలెక్షన్లో 20శాతం సంక్షేమం ( Welfare ) కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పెద్ది ( Peddi ) , రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, అఖండ 2 సినిమాల టికెట్ ధరల పెంపుతో వచ్చిన కలెక్షన్లో 20శాతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్, టీజీఎఫ్డీసీ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది.
ఆ మొత్తాన్ని ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేయాలని నిర్మాతలకు సూచించింది. ఇటీవల విడుదలైన, త్వరలో రాబోతున్న భారీ చిత్రాలకు ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.