KCR | ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సిట్ విచారణకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ బయల్దేరారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు బయల్దేరిన కేసీఆర్కు.. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో అభిమానులు, కార్యకర్తలు, నాయకులు సంఘీభావం తెలుపుతున్నారు.
కేసీఆర్ కాన్వాయ్ పై పూలు జల్లి తమ అభిమానాన్ని చాటుకుంటూ.. దారి పొడవునా వందలాది మంది నిలిచి కేసీఆర్ గారికి మద్దతుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ వేధింపులపై నినదిస్తూ నిరసనలు తెలుపుతున్నారు.
సిట్ విచారణ నేపథ్యంలో బంజారాహిల్స్ నందినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. నందినగర్ బస్ స్టాప్, బసవతారకం రోటరీ, అగ్రసేన్ జంక్షన్, టీఎస్ స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ భవన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలను చేరుకోవాలనిఅధికారులు సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ వేధింపుల్లో భాగంగా జరుగుతున్న సిట్ విచారణకు హాజరు కావడానికి ఎర్రవెల్లి నివాసం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
సిట్ విచారణకు హాజరు కావడానికి హైదరాబాద్ వస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి.. జై… pic.twitter.com/OoEslPOeZ2
— BRS Party (@BRSparty) February 1, 2026