MLA Sanjay Kumar | పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను బీఆర్ఎస్ కార్యకర్త నిలదీశాడు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే గులాబీ కండువా కప్పుకోవాలని డిమాండ్ చేస్తూ సంజయ్ కార్యక్రమానికి వెళ్లాడు. కానీ ఇది గమనించిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తను అరెస్టు చేసి తీసుకెళ్లారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్లధర్మారంలో ఓ కార్యక్రమానికి సంజయ్ వస్తున్నాడని తెలిసి బీఆర్ఎస్ కార్యకర్త నారపాక రవీందర్ అక్కడికి వెళ్లాడు. సంజయ్ రావడానికి ముందే వెళ్లిన అతను.. ఎమ్మెల్యే రాగానే గులాబీ కండువా కప్పాలని రెడీగా ఉన్నాడు. అయితే ఇది గమనించిన పోలీసులు రవీందర్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఇదేంటని అడిగితే బీఆర్ఎస్ కండువా పట్టుకుని ఉండొద్దని పోలీసులు రవీందర్‌ను అరెస్టు చేసి బీర్పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను నారపాక రవీందర్ పలు ప్రశ్నలు సంధించాడు. ఇప్పటికే బీఆర్ఎస్లోనే ఉన్నానని సంజయ్ చెబుతున్నాడు కదా.. మరి పార్టీ కండువా కప్పితే అభ్యంతరమేంటని ప్రశ్నించాడు. కానీ పోలీసులు దీనికి సమాధానం చెప్పకుండా రవీందర్‌ను అక్రమంగా అరెస్టు చేసి బీర్పూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.