Vemula Prashanth Reddy | పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన కొనసాగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ దార్శనిక పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు.
దేశవ్యాప్తంగా తెలంగాణ మాడల్ కావాలనే డిమాండ్ పెరుగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వల్ల పేదలకు ఒరగిందేమీ లేదని ఆయన విమర్శించారు. పచ్చగున్న తెలంగాణ మీద బీజేపీ విషయం చిమ్ముతుందని.. కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని అన్నారు. ఎవరన్ని సర్కస్ ఫీట్లు చేసినా.. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామరక్ష అని అన్నారు.