హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : సభ నుంచి జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ ఏకపక్షమని, ప్రతిపక్ష సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశం గాని, వివరణ ఇచ్చే సమ యం గాని దక్కకపోవటం ఏమిటని, ఏకపక్షంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని రాజకీయవర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి.
సభా సంప్రదాయాల ప్రకారం ఎవరైనా స భ్యుడిపై చర్యలు తీసుకునే ముందు సభ్యుడికి గాని, లేదా సదరు పార్టీ పక్ష నాయకుడికి గాని మాట్లాడే అవకాశం, వివరణ ఇచ్చే సమయం కల్పించాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎథిక్స్ కమిటీ ఆధారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు.