రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరంలో రెండు పిల్లర్లు రిపేర్ చేసి నీళ్లు ఇచ్చి ఉంటే ఈ రోజు ఇంతటి దారుణ పరిస్థితులు ఉండేవి కావని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నీళ్లున్నా కేసీఆర్‌ను బదనాం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ‘మూడు వందల పిల్లర్లలో రెండు పిల్లర్ల వద్ద ఇసుక కదిలి వంగితే, దాన్ని పట్టుకొని కాంగ్రెసోళ్లు దుష్ప్రచారం చేస్తున్నారు.
గోదావరి నీళ్ల ను పైకి తీసుకొస్తే కాళేశ్వరం నడుస్తుందన్న విషయం ప్రజలకు తెలిసి, కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందన్న కారణం తో నీళ్లు విడుదల చేయలేదు. పంటలు ఎండి, కడుపు మండి కేసీఆర్‌ను తిట్టాలన్నది వీళ్ల కుట్ర. పంటలు ఎం డితే ధాన్యం కొనే, బోనస్ ఇచ్చే అవసరం ఉండదన్నదే ఈ ప్రభుత్వ ప్లాన్’ అని వెల్లడించారు.
రైతులు చచ్చినా ఫర్వాలేదని, రాజకీయమే ముఖ్యమని కక్ష కట్టి కాళేశ్వరం కొ ట్టుకుపోయిందని ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం సిరిసిల్లలోని తెలంగాణభవన్ వద్ద రైతులకు మద్దతుగా చేపట్టిన రైతు దీక్షలో ప్రసంగించారు. ‘కేసీఆర్ కాలు బయటపెట్టగానే కొట్టుకు పో యిందనుకున్న కాళేశ్వరంలోని గాయత్రి పంపుహౌజ్, నంది పంపుహౌజ్ ఎలా ప్రారంభమయ్యాయి? చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కొట్లాడితే ఆయను తీసుకెళ్లి జైల్లో పెట్టి, నీళ్లు మాత్రం సాయంత్రం ఇచ్చారు.
మల్లన్నసాగర్లో నీళ్లు విడుస్తారా? లేదా? సాయంత్రం మేమే వెళ్లి గేట్లు ఎత్తాల్నా? అని హరీశ్‌రావు అడిగితే వెంటనే గేట్లు ఎత్తి నీళ్లు విడిచారు. దీని మతలబు ఏమిటి? నీళ్లుం డీ, పంపులు నడిపే అవకాశం ఉండీ కావాలని ఎండపెట్టినోడు ఎవడు? కాంగ్రెసోడే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌లో బ్రిడ్జి కడుతుంటే కింద ఇసుక కదిలి కూలిపోయిందని, మోదీ రాష్ట్రం గుజరాత్లో మార్బీ బ్రిడ్జి కూలిపోతే 190 మంది చనిపోయారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ను ఖతం చేయాలన్న కుట్ర
ఇది కాలం తెచ్చిన కరువా? కాంగ్రెస్ తెచ్చిన కరువా? అన్నది ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ కోరారు. వ్యవస్థనంతా మేడిగడ్డ వద్దే పెట్టి, సీఎం అక్కడి నుంచే పనిచేసి రెండు నెలలు కష్టపడితే బ్రహ్మాండంగా 50 టీఎంసీల నీళ్లతో ఒక్క ఎకరం పంట కూడా ఎండకుండా సౌలత్ ఉంటుండేనని చెప్పారు. ‘వాళ్ల ఉద్దేశం అంతా కేసీఆర్ బదనాం కావాలె. బీఆర్ఎస్ ఖతం కావాలె. రాజకీయం గా వీడిని గుంజాలె, వాడిని గుంజాలె.
ఏదోరకంగా ఆగం చేసి రాజకీయంగా మనుగడ సాధించాలన్న ఆలోచనే తప్ప అభివృద్ధి మీద ధ్యాసలేదు. నిరుడు సాధారణ వర్షపాతం కన్నా 14 శాతం ఎక్కువ వర్షాలు పడ్డాయి’ అని వివరించారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు నిండాయని, ఖజానా నిండుగానే ఉన్నదని, సుభిక్షంగా వారి చేతిలోపెడితే 4 నెలల్లోనే రాష్ర్టాన్ని ఏ గతి చేశారో చూడాలని అన్నారు. రాష్ర్టానికి ఆదాయం ఎలా తేవాలి? పెట్టుబడులు ఎలా తేవాలి? వచ్చిన పైసలు ఎలా సద్వినియోగం చేయాలి? ఉద్యోగుల కల్పన ఎలా చేయాలి? ఏ రకంగా ముందుకు పోవాలన్న ఆలోచన చేయాలని సీఎం రేవంత్‌కు చురకలు అంటించారు.
‘నాలుగు నెలలు కూడా కాకముందే విమర్శలు చేయటం ఏమిటి? అని అడగొచ్చు. అది వాజీబే అయినా, నువ్వే(సీఎం రేవంత్) అన్నవ్ కదా! నువ్వే నరికినవు కదా! వందరోజుల్లో రుణమాఫీ చేస్తానని. రైతుభరోసా ఇస్తానని. ఎవడు చెప్పమన్నడు నిన్ను? చెప్పినవు కాబట్టే అడుగుతున్నాం’ అని స్పష్టం చేశారు. రైతుదీక్ష చేసినట్టే సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాలలో నేతన్నలున్న చోట్ల దీక్షలు చేస్తామని తెలిపా రు. ఇది ఆరంభం మాత్రమేనని, ము న్ముందు ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.
సీఎం గుంపుమేస్త్రీ.. ప్రధాని తాపీమేస్త్రీ
‘రాష్ట్ర ముఖ్యమంత్రి గుంపు మేస్త్రీ.. ప్రధాన మంత్రి తాపీ మేస్త్రీ.. ఇద్దరూ కలిసి తెలంగాణ గొంతుకు సమాధి కట్టాలని, బీఆర్ఎస్ను ఖతం చెయ్యాలని చూస్తున్నరు. ప్రజలు, రైతుల తరఫున కొట్లాడి వారి కుట్రలను తిప్పికొట్టాలి’ అని పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. రైతులను జీపులతో తొక్కి చంపింది ఆ పార్టీయేనని మండిపడ్డారు.
ఏడు పదుల వయసులోనూ 5 జిల్లాలకు పోయి తానున్నానంటూ కేసీఆర్ రైతులకు భరోసా కల్పిస్తుంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఐపీఎల్ మ్యాచ్‌లకు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. దీక్షలో నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యాక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, పార్టీ నాయకుడు గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.