మేడిగడ్డకు మరమ్మతు చేయలేదేం?
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఒక న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారనీ, కానీ కనీసం కేసీఆర్ ఇచ్చిన రూ.10 వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చురకలు అంటించారు.
- కాళేశ్వరంపై కేసీఆర్‌ని దోషిగా చూపేందుకే ఘోష్ నివేదిక
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఒక న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారనీ, కానీ కనీసం కేసీఆర్ ఇచ్చిన రూ.10 వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చురకలు అంటించారు. పంటల బీమా పథకం ఊసే లేదని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌లో హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగులకు పీఆర్సీ, రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వ డం లేదని ఆందోళన వ్యక్తంచేశారు.
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించి వినియోగంలోకి తెచ్చారని గుర్తుచేశారు. రాష్ర్టానికి జీవాధారమైన ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే ప్రభుత్వం ఎందుకు వినియోగంలోకి తేవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ని దోషిగా చూపేందుకే ఘోష్ నివేదిక రూపొందించారని ఆరోపించారు. తాను పార్టీ మారేందుకు రేవంత్‌రెడ్డే కారణమని జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్‌రెడ్డి చెప్పుచేతల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు. నాడు పైరవీలు చేసి రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో మెట్లు ఎక్కి పైకి రావాలని, కానీ తొక్కుకుంటూ వచ్చానని రేవంత్‌రెడ్డి ఓపెన్‌గా చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. పార్టీలో తనను పొమ్మన లేక పొగ బెట్టారని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

