హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ఊహించని విధంగా ముఖ్యమంత్రి పదవి రావడంతో రేవంత్‌రెడ్డికి అహంకారం నెత్తికెకిందని, దాంతో మెదడు పాడైనట్టున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. అందుకే అర్థంకాక.. సోయి లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పేరు ఉచ్ఛరించే అర్హత కూడా రేవంత్‌రెడ్డికి లేదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నాడంటే.. కచ్చితంగా ఆయన మానసికస్థితిపై అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు.
తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసి తెలంగాణ కోసమే పార్టీ పెట్టి.. తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేసి.. అన్ని వర్గాలను ఏకం చేసి.. దేశ పార్టీలన్నింటినీ ఒప్పిం చి.. మీకు తెలంగాణపై ప్రేమ లేదు, తె లంగాణ వారసత్వంపై గౌ రవం లేదు, అందుకే చార్మినార్, కాకతీయుల తోరణాన్ని రాజముద్ర నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు. ఏనాడూ ఉద్యమం లో పాల్గొనని.. జై తెలంగాణ అనని రేవంత్‌రెడ్డి.. ఉద్యమం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని చెప్పారు.