హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): జగిత్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 51 నిమిషాల పాటు ప్రసంగించారు. సభకు అధ్యక్షుడిగా వ్యవహరించిన కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కేసీఆర్ను మాట్లాడాల్సిందిగా పిలవగానే సభా ప్రాంగణం ఒక్కసారిగా దద్దరిల్లింది.
ఇక కేసీఆర్ ప్రసంగిస్తుండగా ‘సీఎం.. సీఎం’ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభిమానులను నిలువరిస్తూనే కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేసీఆర్ ప్రసంగిస్తుండగా రా ష్ట్రంలోని ప్రధాన మీడియా లైవ్ కవరేజీ చూపించింది.
అదే సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో ఏ ర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగా, మీడియా చానళ్లు లైవ్ చూపించకపోవడం గమనార్హం. కేసీఆర్ ప్రసంగం ముగిసిన తర్వాతే సీఎం రేవంత్రెడ్డి ప్రసంగాన్ని కొన్ని చానళ్లు చూపించడం కనిపించింది. కేసీఆర్ ప్రసంగానికి తెలంగాణ సమాజం టీవీలకు అతుక్కుపోయింది. ఇక 51 నిమిషాల కేసీఆర్ ప్రసంగం సీఎం రేవంత్రెడ్డి పేరెత్తకుండానే సాగింది.