Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించడం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్‌రావు స్పందించారు. హామీలు అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని అన్నారు. ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొడితే ఈసీకి కనిపించదని.. సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడితే ఈసీకి వినిపించదని విమర్శించారు. కేసీఆర్ ప్రశ్నిస్తే మాత్రం ఆపుతున్నారని అన్నారు.
కేసీఆర్ బస్సు యాత్ర చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు భయపడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. నిషేధం విధించినా.. ప్రజల గుండెల నుంచి కేసీఆర్‌ను వేరు చేయలేరని స్పష్టంచేశారు.