Dasoju Sravan | హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను, ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది. ఈ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎన్నికలను ఆపి.. వేలం పాటలు పెట్టండి అంటూ ఫిరాయింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ చురకలంటించారు. రాజ్యాంగ సంస్థల ఉద్దేశపూర్వక ఉపేక్ష వల్ల, నిర్లజ్జగా జరుగుతున్న రాజకీయ పార్టీఫిరాయింపులు ఆపలేక పోతే, భారత ఎన్నికల సంఘం ఎన్నికలను ఆపి, వేలం పాటలు పెట్టి , అత్యధిక ధర పలికిన వారికి, ఎమ్మెల్యే స్థానాలను కట్టబెట్టడం మంచిది అని ఆయన సూచించారు.
కులం, ధనం, అబద్ధపు ముచ్చట్లతో తెలంగాణలో అధికారం హస్తగతం చేసుకున్న కురచ మనస్తత్వం గల వ్యక్తులు ఇప్పుడు మన భారత రాజ్యాంగాన్ని కలుషితం చేస్తున్న తీరు అసహ్యకరంగా ఉంది. ఎన్నికైన ప్రతినిధులను బ్లాక్ మెయిల్, బెదిరింపులకు గురి చేయడం లేదా కొనుగోలు చేస్తూ, ప్రజలిచ్చిన ఎన్నికల తీర్పును, మొత్తం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు అని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, దానం నాగేందర్, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, ఎమ్మెల్సీలు భాను ప్రసాద్ రావు, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గే మల్లేశ్, బొగ్గవరపు దయానంద్, బసవరాజు సారయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Stop Elections & Start Auctions
If political defections are being brazenly legitimized due to the deliberate spectatorship of constitutional authorities, it is better that the Election Commission of India stops elections and starts auctions, designating MLA positions to the… pic.twitter.com/9G43k6BXrL
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) July 6, 2024