మౌంట్ మాంగనుయి(న్యూజిలాండ్): న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్ పోరాడుతున్నది. ఓవర్‌నైట్ స్కోరు 110/0తో మూడో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన విండీస్ 6 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. యువ బ్యాటర్ హాడ్జ్(254 బంతుల్లో 109 నాటౌట్, 14ఫోర్లు) అజేయ సెంచరీతో కదం తొక్కాడు.
కివీస్ బౌలింగ్‌ను సమర్థంగా నిలువరిస్తూ హాడ్జ్ తన టెస్టు కెరీర్లో రెండో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో సహచర బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్(27), అలిక్ అతనాజె(45), జస్టిన్ గ్రీవ్స్(43)తో కలిసి హాడ్జ్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. హాడ్జ్‌తో పాటు అండర్సన్ ఫిలిప్(12 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.