అడిలైడ్: ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కైవసానికి ఆస్ట్రేలియా మరింత చేరువైంది. ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న కంగారూలు భారీ విజయంపై కన్నేశారు. ఆసీస్ నిర్దేశించిన 435 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. కెప్టెన్ కమిన్స్(3/24), లియాన్(3/64) ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు.
ఓపెనర్ జాక్ క్రాలీ(85) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న ఇంగ్లండ్ ప్రస్తుతం 228 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 271/4తో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ 349 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(170) డబుల్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు.