మహబూబ్నగర్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నారాయణపేట జిల్లా కోస్గిలో బుధవారం సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మీయ సమ్మేళనాన్ని బీఆర్ఎస్కు చెందిన 27 మంది సర్పంచులు బహిష్కరించారు. ఇటీవల గెలుపొందిన కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించాలని ఆర్భాటంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా.. కనీస సౌకర్యా లు కల్పించడంలో అధికార యం త్రాంగం విఫలమైంది.
మొత్తం 8 మండలాల నుంచి సర్పంచులను పిలిపించి గంటల తరబడి కూర్చోబెట్టారు. వార్డుసభ్యులకు ఉపసర్పంచులు సీట్లు దొరక్క ఎక్కడికక్కడే నిలబడ్డారు. కనీసం మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేయలేదు. మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం వస్తారని చెప్పి 12 గంటలకే వారిని హాల్లోకి రప్పించారు. నాలుగు గంటల తర్వాత సీఎం చేరుకున్నారు. చంటి పిల్లలు ఉన్న మహిళా సర్పంచులు సరైన సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.