తెలంగాణ ఏర్పడక ముందు మంచినీళ్ల కోసం రోజంతా పడిగాపులు కాసేది. పండక్కో, పబ్బానికో సుట్టాలింటికి పోదామంటే.. నీళ్లు ఎప్పుడొస్తయో అని బెంగపడేది. కండ్లళ్ల ఒత్తులేసుకొని నీళ్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. వాళ్లు మా ఇంటికి వచ్చినా నీళ్లు సరిపోక ఇబ్బంది ఉండేది.
ఇగ దావత్లు చేసుకున్నప్పుడు నీటి తిప్పల గురించి చెప్పనక్కర్లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో నీటిగోస తీరింది. ఇప్పుడు ప్రభుత్వం పుష్కలంగా నీటిని సరఫరా చేస్తున్నది. గోదావరి జలాలను హైదరాబాద్కు తీసుకొచ్చి తాగునీటిని అందిస్తున్నరు. సార్నే మళ్లా ఆదరించి అభివృద్ధికే ఓటెయ్యాలని కోరుతున్న.
– దేశపాగ శోభ, కంటోన్మెంట్