ములుగు: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ సత్తా చాటింది. బీఆర్ఎస్ దెబ్బకు అధికార పార్టీ సగం స్థానాలను కూడా దక్కించుకోలేకపోయింది. ములుగు జిల్లాలో అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన ఏటూరు నాగారం (Eturnagaram) సర్పంచ్ స్థానాన్ని మంత్రి సీతక్క (Seethakka) సవాల్‌గా స్వీకరించినప్పటికీ ఓటమి తప్పలేదు. సీతక్క ఐదు సార్లు ప్రచారం నిర్వహించినా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థికి అపజయమే ఎదురైంది. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన కాకులమర్రి శ్రీలత భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఏటూరు నాగారం సర్పంచ్‌గా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు సతీమణి శ్రీలత పోటీచేశారు. ఆమె 3230 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం 8,333 ఓట్లు పోలవ్వగా బీఆర్ఎస్కు 5,520, కాంగ్రెస్ అభ్యర్థికి 2,330, బీజేపీ అభ్యర్థికి 64 ఓట్లు వచ్చాయి. దీంతో మంత్రి సీతక్కకు తన జిల్లాలో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.