ప్రజాక్షేత్రంలో గులాబీ పోరాటం
అసెంబ్లీలో గొంతు నొకినా.. ప్రజాక్షేత్రంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడమే ప్రధాన ఎజెండాగా తదుపరి కార్యాచరణకు పూనుకొంటున్నది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించే అవకాశాలను, గొంతును అధికారపక్షం అడ్డుకున్నా.. ప్రజాక్షేత్రంలో మాత్రం తమను అడ్డుకోలేరనే సందేశాన్నివ్వాలని చూస్తున్నది.
- 3 రోజుల కార్యాచరణపై తెలంగాణభవన్‌లో నేతల సమాలోచనలు
- పోలీసుల దాష్టీకంపై ఎన్‌హెచ్చార్సీలో రేపు ఫిర్యాదు చేయనున్న ఎమ్మెల్యేలు
- నేడు కేటీఆర్ నివాసంలో విస్తృతస్థాయి సమావేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తె లంగాణ) : అసెంబ్లీలో గొంతు నొకినా.. ప్రజాక్షేత్రంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడమే ప్రధాన ఎజెండాగా తదుపరి కార్యాచరణకు పూనుకొంటున్నది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించే అవకాశాలను, గొంతును అధికారపక్షం అడ్డుకున్నా.. ప్రజాక్షేత్రంలో మాత్రం తమను అడ్డుకోలేరనే సందేశాన్నివ్వాలని చూస్తున్నది.
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను ఒకొకటిగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. వాటి అమలు పరిస్థితిని ఎండగట్టడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను సేకరించి ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచాలని భావిస్తున్నది. తమ హకులను కాలరాస్తూ, శాసనసభ్యులను సభలోకి రానివ్వకుండా రోడ్డుపైనే అడ్డుకున్న తీరును, తమపై, మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడిపై లోక్‌భవన్‌లో బుధవారం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం తెలంగాణభవన్‌లో బుధవారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. మూడు రోజుల కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కేటీఆర్ సమాలోచనలు జరిపారు.
రెడీ అవుతున్న రోడ్ మ్యాప్
ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి? ఎకడ నిరసనలు చేపట్టాలి? ఏ విధంగా ప్రభుత్వ హామీలను ప్రజలకు వివరించాలి? వంటి అంశాలపై నేతలతో కేటీఆర్ చర్చించారు. అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేసినా ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో పోరాటం వదిలిపెట్టకూడదని పార్టీ నేతలు సూచించారు. రానున్న రోజుల్లో ఆ పార్టీ చేపట్టాల్సిన పలు అంశాలపై చర్చించి రోడ్డు మ్యాప్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో విస్తృతస్థాయి సమావేశం జరుగనున్నది. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కార్యాచరణలో భాగస్వాములు కానున్న నాయకులతో ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వాన్ని ఏ అంశాలపై టార్గెట్ చేయాలి? ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో ఏ అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి? అసెం బ్లీ సస్పెన్షన్లను ఏ విధంగా రాజకీయంగా ఎదురోవాలి? పోలీసుల వ్యవహారంపై జాతీయ స్థాయిలో ఎలాంటి పోరాటం కొనసాగించాలి? వంటి అంశాలపై మరోసారి లోతుగా చర్చించే అవకాశం ఉన్నది.
మహిళా ఎమ్మెల్యేలతో రేపు ఢిల్లీకి
పోలీసుల దాష్టీకంపై బీఆర్ఎస్ మ హిళా ఎమ్మెల్యేలు శుక్రవారం ఢిల్లీలోని జాతీయ మానవ హకుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ)తోపాటు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. శాసనసభ్యుల హకులను కాలరాస్తూ సభలోకి రానివ్వకుండా రోడ్డుపైనే పోలీసులు అడ్డుకున్న తీరు, ముఖ్యంగా మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడి, జుట్టు పట్టుకోవ డం, చీరను లాగి సాగించిన దుశ్శాసన ప ర్వానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress Government
- KTR
- NHRC
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

