వరంగల్ ఎమ్మెల్సీల సీడీపీ నిధులు విడుదల చేయండి
వరంగల్ ఎమ్మెల్సీల పెండింగ్ నియోజకవర్గ అభివృద్ధి(సీడీపీ) నిధులను వెంటనే విడుదల చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనమండలిలో బుధవారం జరిగిన స్పెషల్ మెన్షన్స్ సందర్భంగా డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఎమ్మెల్సీల పెండింగ్ సీడీపీ నిధులపై ప్రస్తావించారు.
- మంత్రి పొంగులేటికి మండలి చైర్మన్ ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : వరంగల్ ఎమ్మెల్సీల పెండింగ్ నియోజకవర్గ అభివృద్ధి(సీడీపీ) నిధులను వెంటనే విడుదల చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనమండలిలో బుధవారం జరిగిన స్పెషల్ మెన్షన్స్ సందర్భంగా డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఎమ్మెల్సీల పెండింగ్ సీడీపీ నిధులపై ప్రస్తావించారు.
వరంగల్ జిల్లా ఎమ్మెల్సీలకు దాదాపు రూ.113 కోట్ల ప్రతిపాదనలు చేయగా, సీఎం సూచనల మేరకు రూ.49 కోట్లు విడుదల చేస్తామని చెప్పారని అన్నారు. నేటికీ నిధులు విడుదల చేయలేదని చెప్పారు. సీఎం మాటకు కూడా విలువలేకుంటే.. ఆ నిధులను రద్దు చేయాలని డిప్యూటీ చైర్మన్ పేర్కొన్నారు. ఈ దశలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జోక్యం చేసుకొని నిధుల విషయం డిప్యూటీ సీఎం పరిధిలోనిది అయినప్పటికీ.. జిల్లా ఇన్చార్జి మంత్రిగా మీరు సంతకం చెస్తేనే భట్టి విక్రమార్క నిధులు మంజూరు చేస్తారని, అందువల్ల త్వరగా నిర్ణయం తీసుకొని సమస్య పరిష్కరించాలంటూ మంత్రి పొంగులేటికి చురకలు అంటిస్తూ ఆదేశాలు జారీచేశారు.
చేతబడి ఆరోపణలపై ఎన్హెచ్ఆర్సీ నోటీసులు!
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి హరీశ్‌రావుపై చేతబడి, ఆరోపణలకు సంబంధించి దాఖలైన ఫిర్యాదును జాతీయ మానవ హకుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావుపై చేతబడి ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సభ్యసమాజానికి తప్పుడు సందేశం వెళ్తున్నదని హరీశ్‌రావు తరఫు న్యాయవాది కారుపోతుల రేవంత్ జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఆగస్టు 4న ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని చెప్పారు. ఆగస్టు 17న డీజీపీకి సవివరమైన విన్నపాన్ని ఇచ్చినా దర్యాప్తు ప్రారంభించలేదని ఆరోపించారు. ఫిర్యాదులో పేరొన్న అంశాలపై తగిన చర్యలు తీసుకుని, లేఖ అందిన తేదీ నుంచి నాలుగు వారాల్లో యాక్షన్ టేకెన్ రిపోర్టు(ఏటీఆర్)ను కమిషన్‌కు సమర్పించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

