తరుణ్‌భాస్కర్, అనుపమ పరమేశ్వరన్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా నుంచి ‘కాకా ధూమ్ ధమాకా’ అనే పాట ప్రోమోను విడుదల చేశారు.
పెళ్లి బారాత్ నేపథ్యంలో వచ్చే పాట ఇదని, మాస్ డ్యాన్సుతో ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. సురేశ్ బొబ్బిలి స్వరపరచిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. పూర్తి పాటను ఈ నెల 12న విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ దూపాటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: బద్రప్ప గాజుల.