జగిత్యాల : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి.జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరబోతున్న సందర్భంగా జిల్లాలో పండుగ వాతావరణం కనిపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR) అన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న కేసీఆర్( KCR ) ‘ ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్ , ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు.

అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పునారేకీకరణ జరుగుతుందని వెల్లడించారు. జగిత్యాల( Jagityal ) నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని, జగిత్యాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని దీమాను వ్యక్తం చేశారు.కేసీఆర్ బయటకు వస్తే గుంట నక్కలు బయపడుతున్నాయని పేర్కొన్నారు.కేసీఆర్ జగిత్యాలలో సభ ఉంటే మేడి గడ్డలో రేవంత్ సభ ఏర్పాటు చేసుకున్నాడని విమర్శించారు.
రేవంత్ హైట్‌లో చిన్న అనుకున్న. కానీ రేవంత్‌ది చిన్న మెదడని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే హై బ్రిడ్, క్రాస్ బ్రిడ్ ఎమ్మెల్యేనా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన కేసీఆర్ సభ విజయవంతమవుతుందని, కేసీఆర్ సీఎం కావడం ఖాయమని అన్నారు. ఈనెల 20న కేసీఆర్ సాయంత్రం 5,30 నిముషాలకు చేరుకుంటారని వివరించారు. సుమరు గంట సేపు కేసీఆర్ సభ ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు.