BRS | రాష్ట్ర ఆదాయం మొత్తం వడ్డీలు కట్టేందుకే పోతుందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అబద్ధాలపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ విడుదల చేసిన నివేదికను చూపుతూ కాంగ్రెస్ అసత్యప్రచారాలపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కాంగ్రెస్ సన్నాసుల అబద్ధాలను కాగ్ కడిగిపారేసిందని పేర్కొంది.
రాష్ట్ర ఆదాయంలో మొత్తం మిత్తీలకే పోతుంది అంటూ గత కేసీఆర్ ప్రభుత్వం మీద నోటికొచ్చినట్టు అసత్యాలను ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ అడ్డ గాడిదలకు కాగ్ నివేదిక చెంపపెట్టు అని బీఆర్ఎస్ తెలిపింది. CAG లెక్కల ప్రకారం Dec 2023 నుంచి ఇప్పటి వరకు కట్టిన మిత్తి కేవలం రూ. 21,838 కోట్లు మాత్రమే అని పేర్కొంది. కానీ కాంగ్రెస్ దొంగలు మాత్రం రూ. 80,000 కోట్ల మిత్తి కట్టామని ప్రచారం చేస్తుందని మండిపడింది.
తప్పుడు లెక్కలు చెప్పిన సొమ్ము ఎక్కడికి పోయిందని బీఆర్ఎస్ ప్రశ్నించింది. ఆ సొమ్ము ఏం చేశారని నిలదీసింది. దీన్ని బట్టి చూస్తే అందరూ అనుకున్నట్టే తెలంగాణ సొమ్మును మూటలు కట్టి ఢిల్లీకి తరలిస్తున్నరు అన్నది స్పష్టమవుతున్నదని తెలిపింది. బిడ్డా.. ఎన్నికల్లో మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, దొంగ లెక్కలు చెప్పి ఎంత తప్పించుకోవాలనే ప్రయత్నం చేసినా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. తిన్నది మొత్తం కక్కిస్తామని హెచ్చరించింది.
Cag Report