జనగామ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR )నేడు జనగామా జిల్లాలో(Jangaon) పర్యటించ నున్నారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖద్వారం అయిన పెంబర్తి వద్ద కేటీఆర్కు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు.
ప్రజలకు అభివాదం చేస్తూ కేటీఆర్ ముందుకు సాగారు. కేటీఆర్ రాకతో జనగామ పట్టణం గులాబీ మయంగా మారిపోయింది. కాగా, పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లను కేటీఆర్ సన్మానించనున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశా దినిర్దేశం చేయనున్నారు.
