కంఠేశ్వర్, జూన్ 7 : తెలంగాణ సూర్యుడు కేసీఆర్ అని, గులాబీ సైన్యం తెలంగాణ రక్షణ కవచమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ను దెయ్యాల రాజ్యసమితి అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై జీవన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్‌ను జనం దేశ పొలిమేరలు దాటేలా కొడుతున్నా ఢిల్లీలో రాహుల్‌గాంధీ, గల్లీలో రేవంత్‌రెడ్డికి మాత్రం బుద్ధి రావడంలేదని ధ్వజమెత్తారు. తెలంగాణకు పట్టిన కొరివి దెయ్యం రేవంత్.. రాష్ట్ర చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కుతారని పేర్కొన్నారు. రేవంత్ పాలనంతా దేవుళ్లపై ఒట్లు, కేసీఆర్‌పై తిట్లు అన్న చందంగా ఉన్నదని ఎద్దేవా చేశారు.