BRS Party | హైదరాబాద్ : రాష్ట్రంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, ఆందోళనకర స్థాయిలో పెరిగిన రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశం ఇవాళ జరిగింది. కమిటీ చైర్మన్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మంచిరేవులలోని ఆయన నివాసంలో ఈ సమావేశం జరగ్గా.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
కమిటీ సభ్యులు, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, జోగు రామన్న, బాజిరెడ్డి గోవర్ధన్, అంజయ్య యాదవ్, రసమయి బాలకిషన్, యాదవ రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ చర్చించారు. రైతు ఆత్మహత్యలు, రైతు భరోసా మోసం, రైతు రుణమాఫీ పేరిట కాంగ్రెస్ చేసిన దగా, సాగునీటీ కష్టాలు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించారు.
ఇవి కూడా చదవండి..
Bhupal reddy | కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి
Karimnagar | గ్రామ సభలో ఏడుస్తూ అధికారుల కాళ్లు మొక్కిన మహిళ : వీడియో
BRS Party | 28న నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి