BRS Party | హైదరాబాద్ : గ్రేటర్ హైదరబాద్ పరిధిలో టీజీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ బస్సు ఛార్జీల పెంపును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 9వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.
నందినగర్ నుంచి కేటీఆర్, మెహిదీపట్నం నుంచి హరీష్ రావు, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిలకలగూడ నుంచి పద్మారావు గౌడ్, దిల్సుఖ్నగర్ నుంచి సుధీర్ రెడ్డి, ఉప్పల్ నుంచి లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ నుంచి ముఠా గోపాల్, మల్కాజిగిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద్ గౌడ్, కూకట్పల్లి నుంచి కృష్ణారావు నుంచి బస్ భవన్కు చేరుకుని ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇవ్వనున్నారు. పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేయనున్నారు.