BRS Party | భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ప్రారంభమైంది. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లో జరుగుతున్న సమావేశంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాజ్యసభ, లోక్‌సభలో పార్టీ పార్లమెంటరీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావుతో పాటు రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు.
సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతాయి. వచ్చే లోక్‌సభల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది. 31న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండగా.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.