హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని ప్రపంచం మెచ్చేలా పాలించారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని సోమవారం తెలిపారు. పకడ్బందీ వ్యూహాలతో రాష్ర్టాన్ని సాధించటమే కాకుండా ప్రపంచంలోనే తెలంగాణకు ఇమేజ్ను సృష్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొ న్నారు.
కేసీఆర్ నాయకత్వంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమం ప్రపంచాన్నే అబ్బురపరిచాయని తెలిపా రు. ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించడానికి గల కారణాలను లోతుగా అధ్యయనం చేస్తూ, తమ లోపాలపై సమీక్షించుకుంటామని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన కేకే.. ఎన్నికల హామీలను అమలు దిశగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.