KTR | హైదరాబాద్, మార్చి 20, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల అన్నారు. ఆయన పర్యటనలు పార్టీ బలోపేతానికి దోహదం చేయడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంపొందే అవకాశం ఉంటుందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 14 ఏళ్ల ఉద్యమ, 10 ప్రగతి ప్రస్థానంలో భాగస్వామైన గులాబీ పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. గతంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ తట్టుకొని నిలబడిందని గుర్తుచేశారు.