Urea |న్యూఢిల్లీ : తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఒక్క రైతుకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నప్పటికీ ఒకే యూరియా బస్తాను సరఫరా చేస్తున్నారు అధికారులు. అది కూడా సరిపడా యూరియా లేకపోవడంతో.. రైతులు ఒక బస్తా కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు సరిపడా యూరియాను తక్షణమే సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు తక్షణమే తొలగించాలని కేంద్ర మంత్రిని బీఆర్ఎస్ ఎంపీలు కోరారు.