హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): అణు విద్యుత్తు కేంద్రాల ఏర్పాటులోనూ రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపిందని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ధ్వజమెత్తారు. ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ బుధవారం ఇచ్చిన సమాధానం ఆశ్చర్యకరంగా ఉన్నదని తెలిపారు.
దేశంలో కొత్తగా గుజరాత్, కర్ణాటక, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అణు విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు పాలనాపరమైన ఆమోదం తెలిపి, నిధులను సైతం మంజూరు చేసిన మోదీ సర్కారుకు తెలంగాణ ఎందుకు కనపడలేదని ప్రశ్నించారు. 2021-22లో దేశంలోని అణు రియాక్టర్లు కలిపి 47,112 మిలియన్ల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాయని, ఇది దేశంలో ఉత్పత్తయిన మొత్తం విద్యుత్తులో 3.15 శాతానికి సమానమని కేంద్రం వెల్లడించిందని నామా తెలిపారు.