BRS MLCs | హైదరాబాద్ : రైతుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల ఘటనపై శాసన మండలిలో చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. కానీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. సభ్యుల ఆందోళనల మధ్య రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఇదేమీ రాజ్యం.. ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇక కౌన్సిల్ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. మండలి ఆవరణలో తమ నిరసనను కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Dasoju Sravan | లగచర్ల గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలి.. దాసోజు శ్రవణ్ డిమాండ్