MLC Madhusudhana Chary | హైదరాబాద్ : సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ మధుసూదనాచారి మీడియాతో మాట్లాడారు.
ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. స్పీకర్ ప్రకటనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలఫై చేతులు ఎత్తేసిందని అర్థం అవుతోంది. సీఎం ,మంత్రులు కూడా గ్యారంటీలపై పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఎన్నికలప్పుడు ఇన్ని హామీలు ఎలా అమలు చేస్తారంటే ఆర్థిక పరిస్థితిపై తమకు అవగాహన ఉందని భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పు దోవ పట్టించారు. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని స్పీకర్ ప్రసాద్ కుమార్ మాటలతో తేటతెల్లం అయ్యిందని ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు.
అప్పుల గురించి కూడా కాంగ్రెస్ నేతలు అబద్దాలు ప్రచారం చేశారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్షా 43 వేల కోట్లు అప్పులు చేసింది. రాష్ట్రంలో అప్పులతో పాటు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. రాష్ట్రం అంతా గందరగోళం, ఆగమ్యగోచరంగా తయారైంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా క్షేత్రంలో పోరాటం ఉధృతం చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూస్తామని ఎమ్మెల్సీ మధుసూదనాచారి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Niranjan Reddy | తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నారు : నిరంజన్ రెడ్డి
BRS | కాంగ్రెస్ 420 హామీలపై బీఆర్ఎస్ ఆగ్రహం.. గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేత
KTR | బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గం : కేటీఆర్