హనుమకొండ, అక్టోబర్ 29: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని శాసన మండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. ఆ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్‌గూడలో మంగళవారం అభినందన సభ నిర్వహించి సినీ కార్మికుల పిల్లల విద్యాభ్యాసం కోసం తాయిళాలు ప్రకటించి కోడ్ ఉల్లఘించినట్టు తెలిపారు. వెంటనే ఎన్నికల కమిషన్ స్పందించి సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బుధవారం హ నుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సిరికొండ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పా ర్టీ ఓటమి ఖాయమని సర్వేలు చెప్తుండటంతో ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో యూసుఫ్‌గూడలో భారీ సభ ఏర్పాటు చేశారని ఆరోపించారు. సీఎం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల్లో ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈనెల 30, 31వ తేదీలతోపాటు నవంబర్ 4, 5తేదీల్లో సీఎం అధికారికంగా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వార్తలు వస్తున్నప్పటికీ ఆయన ప్రచారానికి ముందే సభల్లో మాట్లాడి ఎన్నికల నియమావళిని తుంగలో తొకాడని మండిపడ్డారు.
యూసుఫ్‌గూడ సభలో సినీ కార్మికుల పిల్లల కోసం నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ విద్యను అందిస్తామని, స్కూల్‌కు స్థలం చూడాలని అధికారులను ఆదేశించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్పప్పుడు అధికారులంతా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తారని, అలాంటప్పుడు ఆదేశించే అధికారం సీఎంకు లేదని స్పష్టంచేశారు. హైదరాబాద్‌కు హాలీవుడ్‌ని తీసుకొస్తానని సీఎం పేర్కొన్నాడని, హాలీవుడ్ స్థాయి ఎకడ? రేవంత్‌రెడ్డి స్థాయి ఎకడ? అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డ సీఎం రేవంత్‌రెడ్డిపై ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియ ర్ నాయకుడు దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, సాంబారి సమ్మారావు తదితరులు పాల్గొన్నారు.