MLC Kavitha | ఆసిఫాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వాంకిడీ ఆశ్రమ పాఠశాలలో విషాహారం తిని మృతిచెందిన బాలిక శైలజ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. శైలజ చిత్రపటానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. గతంలో నిమ్స్ ఆస్పత్రిలో శైలజ చికిత్స పొందే క్రమంలో ఎమ్మెల్సీ కవిత పరామర్శించిన విషయం తెలిసిందే.
చికిత్స పొందుతూ శైలజ మరణించిన విషయం తెలిసి చలించిన ఎమ్మెల్సీ కవిత … ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించారు. దాంతో అప్పుడు ప్రకటించిన రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని స్వయంగా బాలిక నివాసానికి వెళ్లి అందించారు. శైలజ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, అనిల్ జాదవ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Telangana voters list | తెలంగాణ ఓటర్ల సంఖ్య 3.35 కోట్లు.. సవరించిన జాబితా వెల్లడించిన ఈసీ
HMPV | మళ్లీ కరోనా తరహా నిబంధనలు.. హెచ్ఎంపీవీ వ్యాప్తిపై ఐఎంఏ కీలక సూచన
Krishank | తొక్కుడు బిళ్ల ఆడే ఈ ముఖ్యమంత్రికి.. ఫార్ములా-ఈ రేస్ గురించి ఏం తెలుసు? : క్రిశాంక్