MLC Kavitha | హైదరాబాద్ : ఈ నెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. కష్టంతో కాకుండా ఇష్టంతో, ఆత్మవిశ్వాసంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని కవిత కోరుకున్నారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యార్థులకు కవిత ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఇంటర్ వార్షిక పరీక్షలకు ఉదయం 8:45 గంటలలోపు వస్తేనే అనుమతిస్తామన్న నిబంధన పెట్టినా.. 9:05 గంటల వరకు వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షకు అనుమతించనున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య వెల్లడించారు. ఈ సారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా పరీక్షకు అనుమతిస్తామని పేర్కొన్నారు. అయితే ఉదయం 8:45 గంటల వరకు వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని హాల్‌టికెట్లపై ముద్రించిన మాట వాస్తవమేనని, విద్యార్థులు త్వరగా పరీక్షాకేంద్రాలకు వస్తే టెన్షన్‌కు గురవకుండా పరీక్షరాస్తారన్న ఆలోచనతో అలా ముద్రించామని తెలిపారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు!
కష్టంతో కాకుండా ఇష్టంతో, ఆత్మవిశ్వాసంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటూ… ఆల్ ది బెస్ట్ 👍
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 4, 2025