హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 7న తుది వాదనలు వింటామని ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా తెలిపారు.
నిర్దేశిత 60 రోజుల గడవులో పూర్తిస్థాయి చార్జిషీట్ దాఖలులో సీబీఐ విఫలమైందని జూలై 8న కవిత త రఫు న్యాయవాదులు వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేయగా, ఈడీ కేసులోనూ కవితకు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఆగస్టు 13వరకు పొడిగించింది.