MLC Dasoju Sravan | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి కామన్ సెన్స్ లేదు.. క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్ ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రేవంత్ రెడ్డికి చదువు మీద శ్రద్ధ లేదు కాబట్టి ఇంగ్లీష్ రాదు అని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ హాయంలో శాంతి భద్రతలు బాగున్నాయి కనుక పెట్టుబడులు బాగా వచ్చాయి. రేవంత్ పాలనలో పట్టపగలు తుపాకులు పట్టుకుని దుకాణాలను దోచుకుంటున్న పరిస్థితి. పారదర్శకత గురించి మాట్లాడే సీఎం జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏలలో పారదర్శకత ఎందుకు తేవడం లేదు. తనది మధ్యతరగతి మనస్తత్వం అని రేవంత్ అంటారు. రేవంత్ ధరించే టీ షర్ట్లు, బూట్లు, బెల్ట్‌లు మధ్యతరగతి వారు వాడేవేనా..? రేవంత్ రెడ్డిది కామన్ సెన్స్ కాదు క్రూడ్ సెన్స్.. రేవంత్దంతా నాన్ సెన్సే అని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
హైడ్రా, రేరా ఆగడాల గురించి బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడరు..? రేవంత్‌ది భూస్వామ్య, ఫ్యూడల్ మనస్తత్వం. భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచే ఆలోచనలో రేవంత్ ఉన్నారు. ఇది గనుక చేస్తే నిర్మాణ రంగాన్ని ఎవ్వరూ కాపాడలేరు. చావుకు, పెళ్లికి మంత్రం ఒకటే అన్నట్టుగా రేవంత్ తీరు ఉంది. పెట్టుబడులు రావాలంటే కొద్దో గొప్పో ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. రేవంత్ ఇంగ్లీష్ గురించి మాట్లాడటం కేటీఆర్ గురించే అని అందరికీ తెలుసు అని ఆయన పేర్కొన్నారు.
వ్యక్తులకు వ్యతిరేకంగా నేను సుప్రీం కోర్టులో పోరాడటం లేదు. రేవంత్, బీజేపీ, తమిళిసై ఆటలో నేను, సత్యనారాయణయే కాదు.. కోదండరాం కూడా బలి పశువు అయ్యారు. రాజ్యాంగం గెలవాలనేదే మా తాపత్రయం. సెప్టెంబర్ 17న సుప్రీం తీర్పు చారిత్రాత్మకంగా ఉంటుందని ఆశిస్తున్నాం అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డికి కామన్ సెన్స్ లేదు.. క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్ ఉన్నాయి
రేవంత్ రెడ్డికి చదువు మీద శ్రద్ధ లేదు కాబట్టి ఇంగ్లీష్ రాదు – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ https://t.co/JAktFybk74 pic.twitter.com/wFAf1urHAe
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2025