హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ‘రేవంత్‌రెడ్డీ.. తెలంగాణ ఏమైనా నీ తాత జాగీరా? గోదావరి, కృష్ణా నదుల్లో మొత్తం 1,500 టీఎంసీలు తెలంగాణకు వది లి మిగితా నీళ్లను ఆంధ్రా వాళ్లు ఏమైనా చేసుకోవచ్చు.. అని అనడానికి’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్‌తో కలిసి ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటా 1,500 టీఎంసీలే కాకుండా, గోదావరి నదిలో వృథా అవుతున్న 3,000 టీఎంసీలలో తెలంగాణ వాటాగా 1,950 టీఎంసీల నీటి వాటా ను 2016లోనే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సెల్‌ను కోరారని చెప్పారు.
ప్రస్తుతం దానికి వక్రభాష్యం పలుకుతూ బనకచర్ల ప్రాజె క్టు నిర్మాణం కేసీఆర్ వల్లే అంటూ సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి.. చిల్లర రాజకీయాలకు చిరునామాగా మారాడని, సీఎం హోదాలో ఉన్న ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెప్తున్నారని తూర్పారబట్టారు. తెలంగాణ వాటా నీళ్లను చంద్రబాబును అడుక్కుంటా వా? అని నిలదీశారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణలో 86% సాగు యోగ్యమైన భూమి గా మారిందన్న విషయా న్ని తెలుసుకోవాలని హితవు పలికారు. కానీ రేవంత్ హయాంలో ఉన్నదానిలో 2% తగ్గిందని ఆరోపించారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు గోదావరి, కృష్ణా జలాలను పణంగా పెడితే తెలంగాణ ప్రజలు కర్రుకాల్చి వాత పెడుతారని సీఎం రేవంత్‌రెడ్డిని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కేసీఆర్ ముందుచూపుతో వృథా జలాలను ఒడిసి ప ట్టుకోవాలని ఆలోచిస్తే, రేవంత్ మాత్రం ఆ నీళ్లను చంద్రబాబుకు అప్పగించాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీని నొప్పియకుండా, చంద్రబాబును మెప్పించాలనే ధోరణితో రేవంత్ ముందుకు పోతున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై నరనరాన విషం నింపుకుని మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. పొట్టిగా ఉన్న నువు ముఖ్యమంత్రివి కాగా, మాజీ మంత్రి హరీశ్‌రావు పొడుగ్గా ఉంటే నీకొచ్చిన నష్టమేమిటని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
తెలంగాణపై, నదీజలాల విషయంలో, తెలంగాణ హక్కులు, వాటాలపై ఎవరికెంత జ్ఞానం ఉన్నదో తెల్చుకోవడానికి హరీశ్‌రావుతో నువు చర్చకు సిద్ధమేనా? అని సీఎం రేవంత్‌ను దాసోజు ప్రశ్నించారు. హరీశ్‌రావు ఒక్కడే వస్తడు.. దమ్ముంటే నువు 100 మంది తో వచ్చినా సరే చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు. బాడీ షేమింగ్ గురించి సీఎం స్థాయిలో ఉండి మాట్లాడొచ్చా? అని నిలదీశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు చిరుమళ్ల రాకేశ్‌కుమార్, రామచంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.