Dasoju Sravan | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో యూరియా కష్టాల్లేవని, బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు.
తెలంగాణలో యూరియా కొరత ఉంది అని కేంద్ర రసాయన శాఖ మంత్రికి కాంగ్రెస్ ఎంపీలు వినతిపత్రం ఇచ్చి, పార్లమెంట్ ముందు ధర్నా చేస్తారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ధర్నాలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. అయితే తమాషా ఏంటంటే తెలంగాణ మంత్రులు మాత్రం యూరియా కొరత లేదు, బీఆర్ఎస్ రైతులను రెచ్చగొడుతుంది అంటారు.. బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులు పెట్టి భయాందోళనలు సృష్టిస్తున్నారు అంటారు. ఒకవేళ ఇదే నిజమైతే, ఢిల్లీలో ధర్నాలెందుకు పొన్నం ప్రభాకర్ గారు..? అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
ఏమైంది వీళ్లకు!! పొంతన లేని మాటలెందుకు? ఎందుకీ వైరుధ్యం!! అలసత్వం!! ఎందుకీ ద్వంద విధానాలు! రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమా? అని దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ నేతలను నిలదీశారు.
ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ లు యూరియా కొరత ఉంది అని కేంద్ర రసాయన శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చి, పార్లమెంట్ ముందు ధర్నా చేస్తారు. టి.కాంగ్రెస్ ఎంపీ ల ధర్నా లో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు..@priyankagandhi
అయితే తమాషా ఏంటంటే తెలంగాణ మంత్రులు మాత్రం యూరియా కొరత లేదు, బిఆర్ ఎస్ రైతులను… pic.twitter.com/MYGxtjD7L3
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) August 22, 2025