BRS : కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు మహిళా మార్షల్స్‌ను రంగంలోకి దింపింది అధికార పక్షం. దాంతో.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా గన్ పార్క్ చేరుకున్నారు కేటీఆర్, హరీశ్ రావు.
మహిళా మార్షల్స్‌ను ఉపయోగించి తమను అడ్డుకోవాలని చూసిన రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు కేటీఆర్. మహిళల్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వాన్ని నడుపుతారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అనంతరం పీసీ ఘోష్ కమిషన్ ప్రతులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చించేశారు. కమిషన్ కాపీలను చెత్త బుట్టలో వేసి తమ నిరసన తెలిపారు.
LIVE: BRS MLAs Protest at Gunpark. https://t.co/2C1mMKudim
— Office of Harish Rao (@HarishRaoOffice) August 31, 2025
తెలంగాణను జలసౌధంగా మార్చిన కేసీఆర్‌పై కేసులు పెడుతారా? అని కాంగ్రెస్ సర్కార్ హరీశ్ రావు దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీఆర్ఎస్ నాయకులను రేవంత్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందిన ఆయన విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గంగుల కమలాకర్, కాలేరు వెంకటేశ్, పద్మారావు, సునీతా లక్ష్మా రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.