BRS MLAs | పరిగి సబ్ జైల్లో రైతులను పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
BRS MLAs | లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి పరిగి సబ్ జైల్లో ఉన్న రైతులను(Lagacharla farmers) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గురువారం పరామర్శించారు.
వికారాబాద్ : లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి పరిగి సబ్ జైల్లో ఉన్న రైతులను(Lagacharla farmers) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గురువారం పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మరోవైపు లగచర్ల కేసులో అరెస్టయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని హరీశ్‌రావు పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ పగ ప్రతీకారంతో పట్నంను కుట్రపూరితంగా నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైందని.. ఈ అరెస్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మీకు ఓటేస్తే మేలు జరుగుతుం దనుకుంటే పాపానికి.. లగచర్ల గ్రామం భూములను గుంజుకోవడమే నువ్వు చేసే మేలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్‌పై సైతం కుట్రలు చేస్తున్నారని.. ఆ రోజు మల్లన్నసాగర్లో నీ మీద కేసులు పెట్టినమా అంటూ సీఎం రేవంత్‌ను హరీశ్‌రావు ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించామని.. నరేందర్ రెడ్డికి ఏ సంబంధం లేదన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందో తెలియదని.. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడానికి ఒక్క నిముషం ముందు ఒత్తిడి చేసి నరేందర్‌రెడ్డితో సంతకం చేయించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి బడాబాబులపై ప్రేమ ఉందన్నారు. నరేందర్‌రెడ్డి ధైర్యంగా ఉన్నారని.. ఆయనకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు. ధర్మమే గెలుస్తుందని.. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందన్నారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారన్నారు.
కొడంగల్ లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి పరిగి సబ్ జైల్లో ఉన్న రైతులను పరామర్శించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ pic.twitter.com/Oowp92E07b
— Telugu Scribe (@TeluguScribe) November 14, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

